Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి కుర్చీ కోసం.. శివసేన నేతల వార్!

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (15:04 IST)
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా.. ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని శివసేన నాయకులు పేచీ పెట్టుకున్నారు. ఇప్పటికే శివసేన అధిపతి ఉద్ధవ్ థాకరే తానే తానే కాబోయే ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటూ వున్నారు. 
 
సీఎం పీఠం కోసం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే గళం విప్పిన మరునాడే ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్, శివసేన నేతనే సీఎం పీఠం అధిష్ఠిస్తారంటూ వ్యాఖ్యానించారు. రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ వెనువెంటనే స్పందించింది. రౌత్ ను చోటా నేతగా అభివర్ణించిన బీజేపీ, తమ పార్టీ అభ్యర్థే సీఎం పీఠంపై కూర్చుంటారని తేల్చిచెప్పింది. 
 
ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య దూరం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
కాగా వచ్చే నెలలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ - ఎన్సీపీ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఓ మరాఠీ చానెల్ నిర్వహించిన ముందస్తు సర్వేలో వెల్లడైంది. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్రలో బీజేపీ 103, శివసేన 64 చొప్పున సీట్లు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమికి కేవలం 65 సీట్లు దక్కవచ్చని తెలిపింది.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

Show comments