Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితను వివస్త్రను చేసేందుకు కుట్ర: అరెస్ట్.. మహారాష్ట్రలో..

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (16:18 IST)
ఓ వివాహిత(25)ను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని భివాండిలో జరిగింది. నిందితులను సోమవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు నర్పోలి పోలీస్ స్టేషన్ ఎస్ఐ యోగితా కొకటే మంగళవారం తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు.
 
నిందితులను నీలకంఠ్ గణపత్ రాథోడ్, శంకర్ జాదవ్‌లు బాధితురాలు గుర్తించిందని పోలీసులు చెప్పారు. నిందితులిద్దరూ నగరంలోని శివాజీనగర్‌లో నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు.
 
కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన బాధితురాలు నిర్మాణ పనుల కూలీగా పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. అంబేద్కర్ విగ్రహం వీధిలో బాధితురాలి చీరను నిందితులు లాగారు. ఆ తర్వాత ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించారు. అంతేగాక తమతో గడిపేందుకు రూ. 2వేలు ఇస్తామని నిందితుల్లో ఒకడు ఆమెకు చెప్పాడు.
 
అందుకు బాధితురాలు నిరాకరించడంతో ఆమెపై దాడికి ప్రయత్నించారు. ఆమెను రక్షించడానికి వచ్చిన బాధితురాలి వదినపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అక్కడ్నుంచి ఎలాగోలా తప్పించున్న ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు