Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2500 లంచం.. రూ.100 నోట్లే కావాలన్న ఉద్యోగి.. ఏసీబీకి దొరికిపోయాడు.. ఎక్కడ..?

లంచం తీసుకోవడమే తప్పు. అలాంటిది ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచంగా రూ.100నోట్లే కావాలని పట్టుబడ్డాడు. పాత నోట్లు రద్దు కావడంతో.. వంద నోట్లనే లంచంగా ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో బాధితులు ఏసీబీ ఫోన్ చేయడంతో అడ్డ

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2016 (17:03 IST)
లంచం తీసుకోవడమే తప్పు. అలాంటిది ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచంగా రూ.100నోట్లే కావాలని పట్టుబడ్డాడు. పాత నోట్లు రద్దు కావడంతో.. వంద నోట్లనే లంచంగా ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో బాధితులు ఏసీబీ ఫోన్ చేయడంతో అడ్డంగా బుక్కైపోయాడు. తమ వద్ద రూ.500 రూ.1000 నోట్లే ఉన్నాయని తీసుకోవాల్సిందిగా బాదితులు కోరినా పట్టించుకోలేదు. పెద్ద నోట్లు లంచంగా తీసుకోవడం కుదరదంటూ ఉద్యోగి తెగేసి చెప్పాడు. దీంతో విసిగిపోయిన వాళ్లు... ఇక లాభం లేదనుకుని డైరెక్ట్‌గా ఏసీబీ అధికారులకు ఫోన్ చేశారు. దీంతో, లంచావతారం అడ్డంగా బుక్కయ్యాడు. 
 
ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మోహోల్ పంచాయతీలో జరిగింది. బాలాసాహెబ్ భికాజీ అనే వ్యక్తి అక్కడ వ్యవసాయాధికారిగా పని చేస్తున్నాడు. రూ. 2,500 లంచాన్ని వంద రూపాయల్లోనే ఇవ్వాలంటూ వేధిస్తున్న సమయంలో, ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 25 వంద రూపాయల నోట్లను లంచంగా ఇస్తేనే.. మీకు కావాల్సిన పని చేసి పెడ్తానని మొండికేయడంతో.. బాధితులు ఏసీబీ సమాచారం ఇచ్చారు. దీంతో అరెస్టయిన ఉద్యోగిపై పోలీసులు 7, 13 (1) మరియు 13 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments