Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ప్రమాదం.. పది మంది మృతి

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2023 (11:53 IST)
మహారాష్ట్రలో నాసిక్ - షిర్డీ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మృత్యువాతపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కును ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. 
 
గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరిలంచారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. థానే, ఉల్లాస్ నగర్, అంబేర్‌నాథ్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు బస్సులో షిర్డీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది. 
 
ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, ప్రమాదంపై ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments