Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ తరహా ఘటన... హాస్టల్స్ మహిళ స్నానాల వీడియో

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (10:27 IST)
తమిళనాడు రాష్ట్రంలో పంజాబ్ తరహా ఘటన జరిగింది. హాస్టల్స్ మహిళల స్నానాల వీడియోలు లీక్ అయ్యాయి. ఈ హాస్టల్స్‌కు చెందిన ఓ మహిళ ఆ వీడియోలను తన స్నేహితుడికి షేర్ చేసింది. అతను మరికొందరికి షేర్ చేయడంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనం మేరకు... తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లా కముది ప్రాంతానికి చెందిన కాళేశ్వరి అనే 31 ఏళ్ల మహిళ మదురైలోని ఓ ప్రైవేటు లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ బీఈడీ చదువుతోంది. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన వైద్యుడు ఆసిక్‌తో పరిచయం ఏర్పడింది. 
 
కాళేశ్వరి తాను ఉంటున్న హాస్టల్లోని మహిళలు స్నానాలు చేసే వీడియోలు, ఫొటోలను తీసి వాట్సప్‌లో ఆసిక్‌కు పంపసాగింది. రెండు రోజుల క్రితం ఆమెతో పాటు గదిలో ఉంటున్న మరో మహిళ ఆమె సెల్‌ఫోన్‌ను పరిశీలించగా అందులో ఫొటోలు, వీడియోలు కనిపించాయి. 
 
వాటిని చూడగానే నిశ్చేష్టురాలైన ఆమె విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు చేరవేసింది. వార్డెన్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆసిక్‌ను, కాళేశ్వరిని ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసిక్ నుంచి అనేక మందికి ఈ వీడియోలు షేర్ అయినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్‌‌కి పవన్ కళ్యాణ్ పరోక్షంగా పంచ్ ఇచ్చిపడేశారా? (Video)

జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్

అకీరా నందన్ సినిమా ఎంట్రీపై నిర్ణయం వాడిదే : రేణూ దేశాయ్

విజయవాడ నుంచి రాజమండ్రి వరకూ పచ్చదనం ముచ్చటేసింది: రేణూ దేశాయ్

'గేమ్ ఛేంజర్‌'కు రూ.600 - 'డాకు మహారాజ్‌'కు రూ.500 బెనిఫిట్ షో టిక్కెట్ ధర ఖరారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments