Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను.. పోలీసు కాల్పుల్లోనే చనిపోయారు.. అయితే ఏంటి: మధ్యప్రదేశ్ మంత్రి

గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతులపై మధ్యప్రదేశ్ పోలీసులు జరిపిన తుపాకీ కాల్పుల్లో ఐదుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ ఎట్టకేలకు అంగీకరించారు.

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (17:15 IST)
గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతులపై మధ్యప్రదేశ్ పోలీసులు జరిపిన తుపాకీ కాల్పుల్లో ఐదుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ ఎట్టకేలకు అంగీకరించారు. 
 
నిజానికి పోలీసుల కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయిన ఘటనపై ఇన్నిరోజులు బుకాయిస్తూ వచ్చిన ఆయన.. ఎట్టకేలకు తొలిసారి నిజం అంగీకరించారు. పోలీసుల కాల్పుల వల్లే మంద్‌సౌర్‌లో ఐదుగురు రైతులు చనిపోయారంటూ తొలిసారి ఆయన మీడియా ముఖంగా అంగీకరించారు. ‘పోలీసుల కాల్పుల వల్ల ఐదుగురు రైతులు చనిపోయారు. దర్యాప్తులో ఈ విషయం వెల్లడైంది. నేను గతంలో కూడా ఇదే చెప్పాను. కొన్ని మీడియా చానెళ్లలో వచ్చింది కూడా’ అని ఆయన చెప్పుకొచ్చారు.
 
పోలీసుల కాల్పుల వల్లే రైతులు చనిపోయారన్న వాదనను గతంలో భూపేంద్రసింగ్‌ తిరస్కరించారు. రైతుల ఆందోళనలోకి సంఘవిద్రోహ శక్తులు ప్రవేశించి.. ప్రజలు లక్ష్యంగా కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లోనే రైతులు  చనిపోయారని ఆయన చెప్పుకొచ్చారు. కానీ, పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆయన నిజాన్ని అంగీకరించారు.  

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments