Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో అత్యాచారానికి పాల్పడ్డాడు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (16:47 IST)
మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్న వేళ.. మహిళలకు రక్షణ ఇవ్వాల్సిన వారే వారి పాలిట శాపంగా మారారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకుపై పోలీసులు అత్యాచారం కేసు నమోదుచేశారు.

ఎమ్మెల్యే కొడుకు పెండ్లి పేరుతో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని రాష్ట్రానికి చెందిన మహిళా యూత్ కాంగ్రెస్ నాయకురాలు ఆరోపించడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సదరు మహిళ తన కుమారుడిపై తప్పుడు కేసు పెట్టిందని ఎమ్మెల్యే ఆరోపించారు.
 
గత కొంతకాలంగా సదరు మహిళ తన కొడుకును డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుందని, డబ్బులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు అత్యాచారం కేసు పెట్టిందని ఎమ్మెల్యే చెప్తున్నారు.

తన కుమారుడు ఈ విషయాన్ని ముందే తనకు చెప్పాడని, ఈ మేరకు ఏప్రిల్ 1న ఇండోర్ డీఐజీకి కూడా ఫిర్యాదు చేశాడని చెప్పారు. ఇండోర్ డీఐజీని వివరణ కోరగా.. ఇరుపక్షాల ఫిర్యాదులపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. కతో సక్సెస్‌.. దిల్‌రుబాతో రెడీ

నరేష్‌లో 10 మందికి ఉండే ఎనర్జీ ఉంది.. రాత్రి అయితే తట్టుకోలేకపోతున్నా... : నటి పవిత్ర లోకేశ్ (Video)

నిర్మాత దిల్ రాజు నివాసాల్లో ఐటీ మెరుపుదాడులు

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం