Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుడుకి గడ్డం ఉందనీ పెళ్లికి నిరాకరించి అలిగిన వధువు... ఎక్కడ?

సాధారణంగా పెళ్లిళ్లు కట్నకానుల వద్ద తేడాలు వస్తే ఆగిపోవడం చూస్తుంటాం. మరికొన్ని వివాహాలు సరిగ్గా ముహుర్తం సమయానికి వరుడు లేదా వధువు తాము ప్రేమించిన వారితో లేచిపోవడం వల్ల ఆగిపోతుంటాయి.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (10:21 IST)
సాధారణంగా పెళ్లిళ్లు కట్నకానుల వద్ద తేడాలు వస్తే ఆగిపోవడం చూస్తుంటాం. మరికొన్ని వివాహాలు సరిగ్గా ముహుర్తం సమయానికి వరుడు లేదా వధువు తాము ప్రేమించిన వారితో లేచిపోవడం వల్ల ఆగిపోతుంటాయి. కానీ, ఇక్కడ ఓ పెళ్లి వరుడుకి గడ్డం ఉందన్న కారణంగా ఆగిపోయింది. ఇరు కుటుంబాల సభ్యులు ఎంత చెప్పినా వధువు మాత్రం పెళ్లికి అంగీకరించలేదు. చివరకు గ్రామ ప్రజలంతా జోక్యం చేసుకుని వరుడుతో షేవింగ్ చేయించాకే ఈ పెళ్లి జరిగింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లా అజంటీ గ్రామంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన రూపాలీ అనే యువతికి మంగల్‌సింగ్‌తో వివాహం నిశ్చయించారు. అయితే, వధువును చూసేందుకు వచ్చినపుడు వరుడుకి గడ్డం లేదు. దీంతో అతన్ని పెళ్లి చేసుకునేందుకు వధువు సమ్మతించింది. 
 
కానీ, వివాహ వేదిక వద్దకు బంధువులతో సహా ఊరేగింపుగా వచ్చినపుడు వరుడుకి గడ్డం ఉండటాన్ని గమనించిన వధువు... ఈ వివాహం చేసుకోనంటూ అలిగికూర్చుంది. వెంటనే షేవింగ్ చేసుకుని రమ్మని కబురంపింది. అయితే అందుకు వరుడు నిరాకరించాడు. 
 
దీంతో పెళ్లి వేడుకలో గందరగోళం ఏర్పడింది. వరుడు గడ్డం గీసుకుని రావాలన్న కండీషన్ మగ పెళ్లివారికి నచ్చలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగి ముహూర్త సమయం కూడా మించిపోయింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు నచ్చజెప్పిన నేపధ్యంలో వరుడు.. షేవింగ్ చేసుకునేందుకు అంగీకరించారు. దీంతో మరుసటిరోజు ఉదయన్నే మరో ముహూర్తానికి వివాహం జరిపించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments