Webdunia - Bharat's app for daily news and videos

Install App

జువెలరీ షాపులో దొంగతనం.. గర్భవతి అయినా రిమాండ్..

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (09:07 IST)
చంటి పిల్లాడిని, తమ్ముడిని అడ్డం పెట్టుకుని దొంగతనానికి పాల్పడిన గర్భవతి రిమాండ్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే..  రజనీ శర్మ అనే 24ఏళ్ల మహిళ భర్తతో కలిసి ఫతేగఢ్ సాహిబ్ లో నివసిస్తోంది. ఆ జంటకు ఇప్పటికే నాలుగేళ్ల బాబు ఉండగా, ఆమె మరోసారి గర్భం దాల్చింది.

వాళ్లకు సహాయంగా రజనీ తమ్ముడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. మొన్న అక్టోబర్ 9న లూథియానా సిటీకి వచ్చిన రజనీ శర్మ.. ఓ జువెలరీ షాపులో దొంగతనానికి పాల్పడింది. సీసీటీవీ రికార్డుల ఆధారంగా ఫిర్యాదు చేయగా, నాలుగు రోజులు గాలించి ఆమెను పట్టుకున్నారు పోలీసులు.
 
చంటి పిల్లాడిని, తమ్ముడిని అడ్డం పెట్టుకుని రజనీ దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు, ఆమె నుంచి రికవరీ చేసిన నగలను సాక్ష్యాలుగా నిందితులను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. కాగా, తన భర్త రోజు కూలీ అని, అతను తెచ్చిచ్చే డబ్బులతో ఇల్లు గడవటం లేదని, అనివార్య పరిస్థితుల్లోనే జువెలరీ షాపులో దొంగతనం చేయాల్సి వచ్చిందని నిందితురాలు జడ్జిగారికి వివరించింది. 
 
అయితే కోర్టువారు ఈ కథలకు కరిగిపోలేదు. పేదరికాన్ని సాకుగా చెబితే, ఈ దేశంలో నూటికి నలభై మంది పేదలే కదాని ప్రాసిక్యూటర్ వాదించారు. చివరికి ఆమె రిమాండ్ విధించిన కోర్టు.. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రజనీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఆమెతోపాటు దొంగతనంలో పాలుపంచుకున్న తమ్ముడిని జువెనైల్ హోంకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం