Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌జీ ప్రేమ.. ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది.. చివరికి ఏం జరిగిందంటే?

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (12:46 IST)
పబ్‌జీ ద్వారా వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే ఇక్కడ ప్రేమలో పడ్డ మహిళకు అల్రెడీ పెళ్లి అయింది. చివరికి ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రాకు చెందిన ఓ వివాహిత.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నివసిస్తున్న వ్యక్తితో పబ్‌జీ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. 
 
ఈ క్రమంలోనే ఆ మహిళ.. అతడిని కలిసేందుకు హిమాచల్ ప్రదేశ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వారణాసికి బయలుదేరింది. అయితే ఆ మహిళ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె కోసం చాలా చోట్ల గాలింపు చేపట్టారు. అయితే వారు ఎంత వెతికినా లాభం లేకుండా పోయింది. 
 
మరోవైపు పబ్‌జీ ప్రేమికుడిని చూసేందుకు వారణాసి చేరుకున్న ఆ మహిళకు పెద్ద షాక్ తగిలింది. ఇన్ని రోజులు తాను చాట్ చేసింది, క్లోజ్‌గా మాట్లాడింది ఓ 12వ తరగతి చదువుతున్న యువకుడినని తెలుసుకుని కంగుతింది. దీంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని తన కుటుంబానికి ఫోన్ చేసింది. కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆమెను తాను చేసిన తప్పేంటో తెలిసింది. దీంతో తనను ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా కోరింది.
 
మహిళ ఎక్కడుందో తెలియడంతో.. ఆమె కుటుంబ సభ్యులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను కనుగొని.. కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ పబ్‌జీ ప్రేమ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments