Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య ఓ అద్భుతం - ఎన్ని గంటలు పని చేశామని కాదు.. : ఆనంద్ మహీంద్రా

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (16:41 IST)
నా భార్య ఓ అద్భుతమని, ఆమెను చూస్తూ ఉండిపోవడం నాకెంతో ఇష్టమని, అలాగే ఎన్ని గంటలు పనిచేశామన్నది ముఖ్యం కాదని, ఎంత సమర్థవంతంగా పనిచేశామనేదే ముఖ్యమని మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు. వారానికి 90 గంటల పని చేయాలంటూ ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణియన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు పారిశ్రామికవేత్తలు తమతమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 
 
తాజాగా ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, తన భార్య ఓ అద్భుతమైన వ్యక్తి అని ఆమెను చూస్తూ ఉండిపోవడం తనకెంతో ఇష్టమని చెప్పారు. వారానికి ఎన్ని గంటలు పనిచేస్తున్నామనేది ముఖ్యం కాదనీ, ఆ పనిని ఎంత సమర్థవంతంగా పూర్తి చేశామనేదే ముఖ్యమన్నారు. క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలన్నారు. ఓ పెద్ద కంపెనీకి చైర్మన్‌గా నిత్యం బిజీబిజీగా ఉండే తాను ఇలా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండటంపై నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తుంటారని అన్నారు. తాను సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేస్తున్నానని మరికొందరు కామెంట్స్ పెడుతుంటారన్నారు. 
 
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వెనుక తన ఉద్దేశం, తన లక్ష్యం వేరని ఆనంద్ మహీద్రా అన్నారు. కొత్త స్నేహితులను సంపాదించుకోవడానికి తాను ఇక్కడ లేనని, తన వరకూ ఇక్కడ లేనని, సోషల్ మీడియా ఒక గొప్ప బిజినెస్ టూల్ అని వివరించారు. ఒకే వేదికపై కోటి మందికి పైగా ప్రజల నుంచి ఫీడ్‌‍బ్యాక్ పొందే అవకాశం తనకు ట్విట్టర్‌ ద్వార కలుగుతోందని చెప్పారు. ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్‌లో 11 మిలియన్ల ఫాలోయర్లు ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments