Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెగ్గర్లం కాదు.. ప్రతిపక్ష హోదా అడుక్కోవడానికి : వీరప్ప మొయిలీ

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (14:11 IST)
లోక్‌సభలో ప్రతిపక్ష హోదా అడుక్కునేందుకు మేం భిక్షగాళ్ళం కాదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కోసం తామేమీ అడుక్కోవడం లేదన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సీబీఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించిన సవరణపై చర్చ జరిగిన సందర్భంగా మొయిలీ ఈ మేరకు స్పందించారు. 
 
ప్రజాస్వామ్యంలో విధానాలను పాటించాలని, ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా నియంతృత్వ ధోరణితో ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా కోసం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య సుదీర్ఘ కాలం పాటు మాటల యుద్ధం కొనసాగింది. 
 
సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో పది శాతం సభ్యులున్న పార్టీకే ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్న నిబంధనను తెరపైకి తెచ్చిన నరేంద్ర మోడీ సర్కారు 44 సీట్లున్న కాంగ్రెస్‌కు ఆ పదవిని ఇచ్చేందుకు నిరాకరించింది. పైగా, గతంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాన్నే ఇపుడు మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు కూడా అనుసరిస్తున్నట్టు వివరణ కూడా ఇచ్చింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments