Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగో దశ పోలింగ్ : జమ్మూకాశ్మీర్‌లో రికార్డు స్థాయిలో పోలింగ్

ఠాగూర్
మంగళవారం, 14 మే 2024 (09:13 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో దశ పోలింగ్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాలతో పాటు మొత్తం 96 చోట్ల పోలింగ్ జరిగింది. అయితే, ఈ దశలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కూడా పోలింగ్ జరిగింది. ఇక్కడ 1996 సంవత్సరం తర్వాత రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడం గమనార్హం. గత ఎన్నికల్లో ఇకక్డ కేవలం 14.1 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈ సారి మాత్రం 36 శాతం నమోదు కావడం గమనార్హం. 1996లో 41 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఇపుడే భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. మరోవైపు, దేశ వ్యాప్తంగా 63 శాతం పోలింగ్ జరిగినట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 
 
మే 13వ తేదీన ఎన్నికలు జరిగిన లోక్‌సభ స్థానాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణాలో 17, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, తెలంగాణలో 17, ఉత్తరప్రదేశ్‌లో 13, వెస్ట్ బెంగాల్‌లో 8, జమ్మూకాశ్మీర్‌లో 1 చొప్పున ఎన్నికలు జరిగాయి. 
 
ఇంట్లో భర్త శవం ఉన్నా... బాధను దిగమింగుకుని వెళ్లి ఓటు వేసిన భార్య 
 
ప్రజాస్వామ్య దేశంలో పలువురు ఓటు హక్కును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఓటు వేసి తీరుతారు. అందరికీ స్ఫూర్తిదాకయంగా నిలుస్తారు. అలా ఓ మహిళ నిలిచారు. అనారోగ్యంతో చనిపోయిన భర్త శవాన్ని ఇంట్లో ఉన్నప్పటికీ బాధ్యత మరవకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ ఘటన బాపట్ల జిల్లా కారంచేడులో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన గర్నెపూడి చిట్టెమ్మ భర్త సింగయ్య (62) పోలింగ్ రోజైన మే 13 సోమవారం తేదీన అనారోగ్యంతో చనిపోయాడు. 
 
అయినప్పటికీ భర్త శవం ఇంట్లో ఉన్నప్పటికీ ఆమె పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు. 178 పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తద్వారా ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు ఉన్న విలువను ఇతరులకు చాటిచెప్పారు. కాగా, గ్రామంలో చిట్టెమ్మ వీఏవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఓటుపై అవగాహన ఉన్న ఆమె ఎంతో బాధలోనూ ఓటు వేయడం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. దీంతో గ్రామస్థులంతా ఆమెను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments