Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలా నవ్వాలో నాకు తెలుసు.. నవ్వుకు జీఎస్టీ లేదు: రేణుకా చౌదరి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వు పట్ల చేసిన కామెంట్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల రేణుకా చౌదరి స్పందిస్తూ.. ఎలా నవ్వాలి.. ఎప్పుడు నవ్వాలనే విషయం తనకు

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (11:42 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వు పట్ల చేసిన కామెంట్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పట్ల రేణుకా చౌదరి స్పందిస్తూ.. ఎలా నవ్వాలి.. ఎప్పుడు నవ్వాలనే విషయం తనకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నవ్వేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పుకొచ్చారు. నవ్వుపై జీఎస్టీ కూడా లేదంటూ రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. 
 
ఐదు దఫాలుగా తాను రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నానని రేణుకా చౌదరి గుర్తు చేశారు. అలాంటి తనను ప్రధాని మోదీ ఒక నెగటివ్ పాత్రతో పోల్చడం అత్యంత దారుణమని మండిపడ్డారు. మహిళల పట్ల మోదీకి వున్న దృక్పథాన్ని తేటతెల్లం చేస్తున్నారని తెలిపారు. 
 
కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేణుకా చౌదరి నవ్వడంపై ప్రధాని మాట్లాడుతూ ''రామాయణం సీరియల్ తర్వాత ఇంత నవ్వు వినే భాగ్యం నాకు దక్కింది'' అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments