Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనం చేయడానికి కోర్టు అంగీకారం కోరడం సరికాదు...

Webdunia
బుధవారం, 19 మే 2021 (11:29 IST)
పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. సహజీవనం చేసేందుకు కోర్టు అనుమతి కోరడం సరికాదంటూ వ్యాఖ్యానించింది. యువతీ, యువకులు సహజీవనం చేయడం సామాజికంగా, నైతికంగా అంగీకారయోగ్యం కాదని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పును వెలువరించింది. 
 
సహజీవనం చేయడానికి కోర్టు అంగీకారాన్ని కోరడం సరికాదని, సహజీవనం చేస్తున్న వారికి తాము రక్షణ కల్పించలేమని పేర్కొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ఓ యువజంట పెద్దల నుంచి దూరంగా పారిపోయి సహజీవనం చేస్తోంది. తామిద్దరం కలసి ఉంటున్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని హైకోర్టులో వీరిద్దరూ పిటిషన్ వేశారు. అయితే, వధువు కుటుంబం నుంచి ప్రాణహాని వుందని, అందువల్ల సహజీవనం చేసేందుకు కోర్టు అనుమతివ్వాలంటూ వారు పిటిషన్‌లో కోరారు. 
 
దీన్ని విచారణకు స్వీకరించిన కరో్టు... సహజీవనం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తూ, వారు వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు సహజీవనాలకు అనుకూలంగా గతంలో సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. మేజర్లుగా ఉన్న యువతీయువకులు పెళ్లి చేసుకోకపోయినా, పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఉంటుందని సుప్రీంస్పష్టం చేసింది. సహజీవనం మన దేశంలో ఆమోదయోగ్యం కాకపోయినా, పాపం మాత్రం కాదని చెప్పింది. మేజర్ యువతి తనకు నచ్చిన తోడును ఎంచుకోవచ్చని వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments