Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మ కీలుబొమ్మ పళనికి ఎమ్మెల్యేల మద్దతు.. ప్రజాభిప్రాయం ఉన్నా పన్నీరుకు కన్నీరు..

తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమ్మ డీఎంకే ప

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (12:05 IST)
తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ రెండుగా చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమ్మ డీఎంకే పేరిట.. జయలలిత మేనకోడలు దీప, పన్నీర్ సెల్వం వేరు కుంపటి పెట్టుకునేందుకు సంసిద్ధమవుతున్నట్లు తేలిపోయింది. అమ్మ మరణం వెనుక శశికళ హస్తముందని సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ.. చిన్నమ్మను ఏకిపారేసిన పన్నీర్ సెల్వం అమ్మ నడిపిన పార్టీ నుంచి ఇప్పటికే వెలివేయబడ్డారు. 
 
అంతేగాకుండా ఎమ్మెల్యేలు సైతం మన్నార్ గుడి మాఫియాకు సపోర్ట్ చేయడంతో.. పళని స్వామి సీఎం అభ్యర్థిగా బలపరీక్ష చేయించుకోనున్నారు. ఆ బల పరీక్ష కూడా సెల్వం చేతుల మీదుగా జరుగనుంది. అయితే పన్నీర్ సెల్వంకు ఆయన తరపు ఎమ్మెల్యేలకు చిన్నమ్మ చేసిన సీన్ మింగుడుపడట్లేదు. చిన్నమ్మకు వ్యతిరేకంగా.. అమ్మ మరణానికి ఆమే కారణమని బహిరంగంగా చెప్పినా.. ఆమె వెంట ఎమ్మెల్యేలు పోవడంపై పన్నీర్ సెల్వం నిరాశ చెందారు. ధర్మం గెలుస్తుందనుకుంటే.. కుట్రలు కుతంత్రాలకే రాజకీయాల్లో స్థానమైపోయిందని.. సన్నిహితులతో పన్నీర్ సెల్వం ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పన్నీరుకు, ఆయన తరపు ఎమ్మెల్యేలకు దిక్కుతోచని పరిస్థితి. ఫలితంగా వేరు కుంపటి  పెట్టేందుకు పన్నీర్ రెడీ అయిపోతున్నారు.
 
అమ్మ పేరిట దీపతో కలిసి కొత్త పార్టీని నెలకొల్పేందుకు రంగం సిద్ధమవుతోంది. చిన్నమ్మ చేతిలో అన్నాడీఎంకే పార్టీ నలిగిపోనుందని.. ఆ పార్టీ త్వరలో మన్నార్ గుడి మాఫియా చేతికి వెళ్ళనుందని.. నిజాయితీగా పార్టీకి కాపాడుకోవాలనుకున్న తనకు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వకపోవడం దారుణమని పన్నీర్ భావిస్తున్నారు. అయితే అన్నాడీఎంకే పార్టీకి వినాశనం ఖాయమని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. ఇక శశికళ తన బంధువులకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో పార్టీలో అసమ్మతి ఉన్నా ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ మేలు కోసం చిన్నమ్మ కీలుబొమ్మ పళని స్వామిని సీఎంగా ఎంపిక చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments