Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలాం అంత్యక్రియలు పూర్తి: రామేశ్వరంలో స్మారక మందిరం ఏర్పాటు

Webdunia
గురువారం, 30 జులై 2015 (12:21 IST)
డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలామ్ అంత్యక్రియలు ముగిశాయి. వేలాది మంది అభిమానులు, ప్రజలు, రాజకీయ నేతలు కన్నీటి వీడ్కోలు మధ్య.. ఈ ఉదయం 11:45 గంటల సమయంలో ప్రముఖ నేతలు తుది నివాళులు అర్పించిన తరువాత, ప్రత్యేక ప్రార్థనల మధ్య ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని భూమాత ఒడిలోకి పంపారు.

అంతకుముందు సైనిక లాంఛనాల సూచకంగా, గాల్లోకి కాల్పులు జరిపారు. 'కలాం అమర్ రహే' అంటూ అభిమానుల నినాదాలు మిన్నంటాయి. ఆయన అంత్యక్రియలు జరిగే స్థలంలో కలాం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామని, స్మృతివనం నిర్మిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
ఇకపోతే.. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు పుట్టిన ఊరులోనే స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు రామేశ్వరంలోనే ఆయన స్మారక మందిరం నిర్మాణం జరగనుంది. మొదట ఢిల్లీలోని గాంధీ సమాధి పక్కన దాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది.

కుటుంబ సభ్యులు మాత్రం రామేశ్వరంలోనే నిర్మించాలని కోరారు. ఆ మేరకు తగిన స్థలాన్నిపరిశీలించాలని కలెక్టర్‌ను ఆదేశించడంతో పేక్కరుంబులో ప్రభుత్వానికి చెందిన 1.32 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments