Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో కిక్కుకి పరాకాష్ట - లిక్కరు బిల్లు రూ.95,347

Webdunia
మంగళవారం, 5 మే 2020 (16:55 IST)
కిక్కు పరాకాష్టకు చేరింది. దీనికి నిదర్శనమే ఓ లిక్కరు బిల్లు ఏకంగా రూ.95347, మరో లిక్కరు బిల్లు రూ.52,841. ఈ రెండు బిల్లులు ఇపుడు నెట్టింట వైరల్ అయ్యాయి. పైగా, ఈ విషయం పోలీసుల దృష్టికి చేరింది. దీంతో ఒకే వ్యక్తికి అధిక మొత్తంలో మద్యం విక్రయించినందుకుగాను వైన్ షాపుపై అబ్కారీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, కేంద్రం ఇచ్చిన సడలింపులతో దేశవ్యాప్తంగా 46 రోజుల తర్వాత మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. దీంతో మందుబాబులు పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కొందరు వేలాది రూపాయలకు మందును కొనుగోలు చేస్తున్నారు. 
 
బెంగుళూరులో వెనిల్లా స్పిరిట్ అనే వైన్ షాపు ఓ వ్యక్తి ఏకంగా రూ.52841 విలువ చేసే మద్యాన్ని కొనుగోలుచేశారు. ఈ తాగుబోతు తానేదో ఘనకార్యం చేసినట్టుగా ఆ బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. 
 
అలాగే, బెంగుళూరుకు చెందిన మరో వ్యక్తి రూ.95347కు మద్యం కొనుగోలు చేసి రికార్డు బ్రేక్ చేశాడు. ఈ రెండు ఘటనల వ్యవహారం ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments