అయోధ్యపురిలో రామ మందిర నిర్మాణం కోసం బుధవారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమాన్ని టీవీల ముందు కూర్చొని తిలకించిన ప్రతి హిందూ భారతీయుడు పులకించిపోయారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించిన కోట్లాది మంది భారతీయుల్లో సీనియర్ న్యాయవాది పరాశరన్ ఒకరు.
ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి భూమిపూజ కార్యక్రమాన్ని ఉద్వేగభరితులై చూస్తున్న క్షణాలను ఇలా కెమెరాలలో బంధించారు. అయోధ్య కోసం అవిశ్రాంతంగా పరాశరన్ న్యాయపోరాటం చేశారు. సుప్రీంకోర్టులో కేసు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే అయోధ్య కేసులో కె. పరాశరన్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తారు.
ఇకపోతే, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ భూమిపూజ మహోత్సవ ఘట్టాన్ని అతికొద్ది మంది ఆహ్వానితుల మధ్యే నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ శాఖలు భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశాయి. ఫలితంగా కోట్లాదిమంది భారతీయులు చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించి పులకించిపోయారు.
అలా వీక్షించిన రాజకీయ అగ్రనేతల్లో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుప్రీంలో అయోధ్యపై వాదించిన సీనియర్ న్యాయవాది కె. పరాశరన్ తమ నివాసాల నుంచి టీవీలలో భూమి పూజ కార్యక్రమాన్ని చూశారు. వాటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.
Respected Advocate Sri K Parasaharan who argued for Sri Ram Lalla Virajmaan viewing Bhumipujan of #SriRamMandir at his home with deep devotion . Heartfelt moments ...