Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై తల్లడిల్లిన గర్భిణీ.. తల్లిగా మారిన ఇన్‌స్పెక్టర్

Webdunia
శనివారం, 21 సెప్టెంబరు 2019 (11:21 IST)
చెన్నైలో ఓ లేడీ ఇన్‌స్పెక్టర్ గర్భిణీ మహిళను కాపాడారు. నడిరోడ్డుపై గర్భిణీ మహిళ పురిటి నొప్పులతో తల్లడిల్లింది. వెంటనే డ్యూటీలో వున్న లేడీ ఇన్‌స్పెక్టర్ తల్లిగా మారి.. గర్భిణీ మహిళను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై చూలైమేడుకు చెందిన భానుమతి నిండు గర్భిణీ. ఈమె ఇంట్లో ఒంటరిగా వుండగా.. రాత్రిపూట ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. 
 
ఆ సమయంలో సహాయానికి ఇంట్లో ఒక్కరూ లేరు. ఆస్పత్రికి వెళ్లేందుకు చూలైమేడు రోడ్డుపైకి భానుమతి వచ్చింది. అయితే ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో రోడ్డుపై పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో డ్యూటీలో వున్న చూలైమేడ్ ఇన్‌స్పెక్టర్ చిత్ర.. వెంటనే భానుమతిని ఆస్పత్రికి తరలించే లోపే కాన్పు జరిగేలా వుంటే.. ఇద్దరు మహిళల సాయంతో రోడ్డుపైనే తల్లిగా మారి ప్రసవం చేశారు. 
 
ఈ క్రమంలో భానుమతి మగశిశువు జన్మించింది. ఆపై తల్లిని శిశువును ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ చిత్రపై ఉన్నతాధికారులు ప్రశంసలు కురిపించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments