Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్‌బాస్ కోసం కుమార్ విశ్వాస్‌కు భారీ ఆఫర్... Rs.5 కోట్లు!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (10:15 IST)
టీవీ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోలో సెలబ్రిటీలు ఒక ఇంటిలో కొంతకాలం బయటి ప్రపంచాన్ని చూడకుండా జీవిస్తారు. వారి ప్రవర్తన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డవుతూ ఉంటుంది. కాలం గడిచేకొద్దీ సెలబ్రిటీల ఎమోషన్లు బయటపడుతూ ఉంటాయి. ఆ ఫుటేజ్‌తో టీవీ ఎపిసోడ్స్ రూపొందిస్తారు. ఈ కార్యక్రమం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్‌కు బిగ్ బాస్ నిర్వాహకులు భారీ ఆఫర్ ఇవ్వజూపినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఈ బంపర్ ఆఫర్‌లో భాగంగా ఆయనకు రూ.5 కోట్లు ఇచ్చేందుకు రియాలిటీ షో నిర్వాహకులు ముందుకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెల్సిందే. స్వతహాగా మంచి కవి అయిన కుమార్ విస్వాస్ ఆ తర్వాత రాజకీయ నేతగా మారారు. ఈ ఆఫర్ అంశంపై విశ్వాస్ సన్నిహితులు స్పందిస్తూ.. బిగ్‌బాస్ ఆఫర్ వాస్తవమేనని చెప్పారు. అయితే తాను పాల్గొంటున్నదీ లేనిదీ మాత్రం విశ్వాస్ ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments