Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుల్‌భూషణ్ జాదవ్ కుటుంబ సభ్యులు కనిపించడం లేదు.. ఏమయ్యారు...?

గూఢచర్య ఆరోపణల కింద భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌‌పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ వార్తను వినగానే భారత్‌లోని ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. నిజానికి వారంతా మహ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (12:33 IST)
గూఢచర్య ఆరోపణల కింద భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌‌పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ వార్తను వినగానే భారత్‌లోని ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. నిజానికి వారంతా మహారాష్ట్రలోని పూణెలో నివశిస్తున్నారు. 
 
అయితే, జాదవ్‌కు పాక్ కోర్టు ఉరిశిక్ష విధించిందన్న వార్త మీడియాలో ప్రసారం కాగానే జాదవ్ భార్య, ఆయన తల్లి, కుమారుడు శుభాంకర్, కుమార్తె భార్వి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా పాకిస్థాన్ కోర్టు అంత పెద్ద నిర్ణయం తీసుకోవడంతో వారంతా కుంగిపోయినట్లు తెలుస్తోంది. 
 
ఆ తర్వాత వారంతా పూణెలోని ఇంటిని ఖాళీ చేసి కనిపించకుండా పోయారు. వీరు ఎక్కడికి వెళ్లారనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ముంబై పోలీస్ కమిషనర్‌గా పనిచేసి రిటైర్ అయిన కుల్‌భూషణ్ తండ్రి సుధీర్ జాదవ్ ప్రస్తుతం మహారాష్ట్ర నైరుతి ప్రాంతానికి చెందిన షాంగ్లీలో నివాసం ఉంటున్నారు. వీరంతా అక్కడికే వెళ్ళివుంటారని భావిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments