Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జలాల కేసు ఏప్రిల్‌కు వాయిదా..! పంచుకోవడమే బెస్ట్.. సుప్రీం అభిప్రాయం..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (10:14 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మధ్య కొంతకాలంగా సాగుతున్న కృష్ణా జలాల వివాదం కేసును సుప్రీం కోర్టు ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు శుక్రవారం విచారణకు రాగా కృష్ణానది జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి లభించిన నీటిని కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవడం ద్వారా వివాదానికి తావుండదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. 
 
కృష్ణా ట్రిబ్యునల్‌ నీటి పంపిణీ వివాదంపై పిటిషనర్లు, ప్రతివాదులైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలు మూడు వారాల్లోగా తమ వాదనల్ని మూడు పేజీలకు మించకుండా దాఖలు చేయాలని, తదుపరి విచారణ ఏప్రిల్‌ 29వ తేదీన జరుపుతామని తెలిపింది.
 
అంతే కాకుండా జలవివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించొద్దని కోర్టు ఈ సందర్భంగా మూడు రాష్ట్రాలకూ హితవు పలికింది. ఎక్కువ వాయిదాలు కోరకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అయితే గెజిట్‌లో తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా కోరుతూ వస్తున్న విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments