Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా టాప్ కింద చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు... ఎయిర్ హోస్టెస్

ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్సులో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ తనపై లైంగిక దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే ఆ ఫిర్యాదు రిజిస్టర్ చేసినా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆమె పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వివరాలను చూస్తే... కోల్‌కతా లోని

Webdunia
బుధవారం, 18 అక్టోబరు 2017 (16:25 IST)
ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్సులో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్ తనపై లైంగిక దాడి జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే ఆ ఫిర్యాదు రిజిస్టర్ చేసినా ఇప్పటివరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని ఆమె పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.  వివరాలను చూస్తే... కోల్‌కతా లోని బీదానగర్ పరిధిలో ఓ ఎయిర్ హోస్టెస్ తన తల్లిదండ్రులతో కలిసి ఓ ఇంటిలో అద్దెకు వుంటోంది. ఈ క్రమంలో ఓ రోజు రాత్రి ఇంటి లోపలికి వస్తున్న సమయంలో ఇంటి యజమాని ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 
 
అడ్డు వచ్చిన ఆమె తల్లిదండ్రులను కూడా దుర్భాషలాడాడు. దీనితో అతడిపై ఫిర్యాదు చేసేందుకు ఎయిర్ హోస్టెస్ పోలీసులను ఆశ్రయించింది. రాత్రి సమయం కావడంతో డ్యూటీ అధికారి మరుసటి రోజు రావాలని సూచించారు. దాంతో  పొద్దుపోయాక ఇంటికి చేరుకున్న ఎయిర్ హోస్టెస్ తలుపు తట్టగా ఎంతకీ ఇంటి యజమాని తలుపు తీయలేదు. చాలాసేపు అలాగే వెయిట్ చేసిన తర్వాత ఎప్పటికోగాని తలుపు తీయలేదు. 
 
తనపై ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని మరోమారు ఎయిర్ హోస్టెస్ పైన దాడికి దిగాడు. తనపై జరిగిన దాడిని పేర్కొంటూ బాధితురాలు... తన టాప్ లోపలికి చేతులు పోనిచ్చి అసభ్యంగా ప్రవర్తించాడనీ, ఇంకా చెప్పుకోలేని బూతులు తిట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడు తనపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నిస్తుంటే తన తల్లిదండ్రులు అడ్డుకునే ప్రయత్నం చేశారని వెల్లడించింది. 
 
ఐతే అతడి భార్య తన తల్లిదండ్రులను నోటికి వచ్చినట్లు తిట్టిందని, భర్త చేస్తున్న అరాచకానికి ఆమె మద్దతుగా నిలిచిందని తన ఫిర్యాదులో పేర్కొంది. తను కేసు నమోదు చేసినా ఇప్పటివరకూ పోలీసులు స్పందించలేదనీ, పరిస్థితి ఇలాగే వుంటే తను కోర్టుకు వెళ్తానని చెప్పింది. కాగా దాడి చేసిన ఇంటి యజమాని మాత్రం తనకు రాజకీయ లింకులు వున్నాయనీ, తమపై తప్పుడు కేసు పెట్టినందుకు జైల్లో పెట్టిస్తానని బెదిరిస్తున్నట్లు ఆమె వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం