Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా పుస్తకాన్ని సినిమా తీస్తే ఆస్కార్ ఖాయం'... కిరణ్‌బేడి ధీమా

Webdunia
గురువారం, 27 నవంబరు 2014 (18:10 IST)
తాను రాసిన 'ఇట్స్ ఆల్వేస్ పాజిబుల్' పుస్తకాన్ని సినిమాగా తీస్తే ఆస్కార్ అవార్డు ఖాయమని ప్రముఖ సామాజికవేత్త, మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలోని ఆర్‌కేవీ స్టూడియోస్ బుధవారం జరిగిన 'తీగార్' ఆడియో విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్‌బేడి మాట్లాడుతూ... తీహార్ జైలుతో తన అనుబంధాన్ని, జైలులో ఖైదీల్లో నడవడికల్లో మార్పు తెచ్చేందుకు తాను చేపట్టి సంస్కరణలను గురించి తెలిపారు. 
 
తీహార్ జైలు అనుభవాలు ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని ఒక పుస్తకం రాశానన్నారు. 'ఇట్స్ ఆల్వేస్ పాజిబుల్' పేరుతో కూడిన ఈ పుస్తకాన్ని సినిమాగా తీసేందుకు హిందీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. తన పుస్తకాన్ని తమిళంలోకి అనువదించే ఆలోచన ఉందని కిరణ్‌బేడి తెలిపారు.

తమిళంలోకి అనువాదమైతే తాను సినిమా తీసేందుకు సిద్ధమేనని 'తీగార్' దర్శకడు పేరరసు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో  పార్తిబన్, భరత్, పేరరసు తదితరులతో పాటు కిరణ్‌వేడి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments