Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమెకు నాలుగు నెలలు.. గర్భిణీ కడుపుపై తన్నిన సీపీఐ నేత.. ఎక్కడ?

కేరళలోని కోళికోడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సీపీఐ (ఎమ్) నేత.. ఓ గర్భిణీ కడుపుపై తన్నాడు. ఈ ఘటనలో బాధితురాలికి గర్భస్రావం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వ్యక్తులు బాధితురాలి భర్తపై దాడ

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (18:05 IST)
కేరళలోని కోళికోడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సీపీఐ (ఎమ్) నేత.. ఓ గర్భిణీ కడుపుపై తన్నాడు. ఈ ఘటనలో బాధితురాలికి గర్భస్రావం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వ్యక్తులు బాధితురాలి భర్తపై దాడికి పాల్పడ్డారు. దీంతో తన భర్తను కాపాడేందుకు గర్భిణి మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే బాధితురాలి భర్తపై దాడికి దిగిన వ్యక్తుల్లో ఒకరైన స్థానిక సీపీఎం నేత గర్భిణి మహిళ అనే కనికరం లేకుండా ఆమె కడుపుపై తన్నాడు. వెంటనే ఆమెకు రక్త స్రావం అయ్యింది. 
 
ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు అబార్షన్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో వున్నాడు. భర్తపై దాడికి పాల్పడిన స్థానిక సీపీఐ నేత వున్నారని.. అతని పేరు వెల్లడించవద్దని సీపీఐ కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుందని బాధితురాలు వాపోయింది. 
 
కేసును వాపసు తీసుకోవాలని వారు బెదిరిస్తున్నట్లు చెప్తోంది. కానీ ఈ ఘటనతో సీపీఐ నేతకు సంబంధం లేదని కార్యకర్తలు చెప్తున్నారు. అయితే ఈ కేసులో ఏడుమందిని అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు నెలల గర్భంతో వున్న తన కడుపు సీపీఐ నేత తన్నాడని.. అతనికి శిక్ష పడాలని తనకు న్యాయం జరగాలని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments