Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చివేస్తాం : ఖలీస్థాన్ టెర్రరిస్టుల హెచ్చరిక

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (08:54 IST)
ఖలీస్తానీ వేర్పాటువాది హర్దీబ్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని పేల్చి వేస్తామని ఖలీస్తానీ ఉగ్రవాదులు హెచ్చరించారు. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన టెర్రరిస్ట్ గురుప్రత్వంత్ సింగ్ పన్ను హెచ్చరికలు జారీచేశాడు. ఈ మేరకు రికార్డు చేసిన ఓ వీడియోను రిలీజ్ చేశాడు. 
 
ఈ వీడియోలో భారత్‌తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీలకు హెచ్చరిక జారీచేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిక్ ఫర్ జస్టిస్ గ్రూపు నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. 
 
ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌కు అక్టోబరు 5వ తేదీన ఈ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. దీంతో ఈ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. నిజ్జర్ హత్యపై మేం మీ బుల్లెట్‌కు వ్యతిరేకంగా మా బ్యాలెట్‌ను ఉపయోగించబోతున్నామని, తాము మీ హింసకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నామని చెప్పాడు. ఈ అక్టోబరు 5వ తేదీన జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, ఇది ప్రపంచ టెర్రర్ కప్ నాంది నాంది అన్నాడు. ఈ సందేశం గురుప్రత్వంత్ సింగ్ పన్ను నుంచి వచ్చిందని ఆ రికార్డింగ్లో ఉంది.
 
అలాగే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అగౌరవపరిచినందుకు భారత రాయబారి వర్మను హతమారుస్తామని అందులో హెచ్చరించాడు. వర్మను భారత్‌తు తీసుకురావడం, ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయడం చాలా తెలివైన పని అన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాతస్య మరణం ధ్రువం తో సీరత్ కపూర్ సక్సెస్ తెచ్చిపెడుతుందా

Pushpa 2: రూ.1799 కోట్లకు వసూలు చేసిన పుష్ప-2.. సరికొత్త రికార్డులు

రాజమండ్రి వేదికగా సినీరంగంపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన !

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments