Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటి ఇంట్లోని పనివాడు రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు.. ఎలా?

Webdunia
మంగళవారం, 21 మార్చి 2023 (14:18 IST)
కేరళకు చెందిన నటి రజిని చాందీ ఇంట్లో గత కొన్నేళ్లుగా అస్సోం రాష్ట్రానికి చెందిన ఆల్బర్ట్ టిగా అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈయన రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యాడు. అదెలాగో ఓసారి తెలుసుకుందాం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగానే లాటరీ టిక్కెట్లను విక్రయిస్తుంది. వీటిని కొనుగోలు చేసే సామాన్య ప్రజలకు లక్కీడిప్ తగలుతుంది. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులై పోతున్నారు. తాజాగా ఆల్బర్ట్ టిగా కూడా రాత్రికిరాత్రి కోటీశ్వరుడు అయ్యాడు. 
 
ఇటీవల ఆయనకు కేరళ లాటరీ విభాగం సమ్మర్ బంపర్ ఆఫర్ బీఆర్ 90 లాటరీ టిక్కెట్లను విక్రయించింది. ఈ టిక్కెట్‌ను కొనుగోలు చేసిన టిగాకు ఒక్కసారిగా పది కోట్ల రూపాయలకు బంఫర్ లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వెంటనే లాటరీ సొమ్మును క్లైం చేసుకుని ఆ టిక్కెట్‌ను కొచ్చిన్‌‍లోని భారతీయ స్టేట్ బ్యాంకుకు ఇచ్చాడు. ఎస్.బి.ఐ క్యాథలిక్ సెంటర్ శాఖలో మేనేజర్ గీవర్గీస్ పీటల్ ఆ సొమ్మును టిగాకు అందజేశాడు. ఎర్నాకులంకు చెందిన లాటరీ ఏజెంట్ ఎమ్డీ జాన్ ఈ టిక్కెట్‌ను విక్రయించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments