Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో 'నిఫా' వైరస్... వైద్యుల పర్యవేక్షణలో 86 మంది రోగులు

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (11:02 IST)
కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్‌ను గుర్తించారు. కొచ్చిన్‌కు చెందిన ఓ రోగిలో ఈ వైరస్‌ను గుర్తించినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కెకె.శైలజ అధికారికంగా వెల్లడించారు. అలాగే, వైద్యుల పర్యవేక్షణలో మరికొంతమంది ఉన్నట్టు తెలిపారు. ఈ రోగి 23 యేళ్ల కాలేజీ విద్యార్థి అని చెప్పారు. 
 
ఇదే అంశంపై మంత్రి శైలజ మాట్లాడుతూ, నిఫా వైరస్ సోకిన రోగిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆ రోగికి పూణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగం వైద్యులు జరిపిన పరిశోధనలో నిఫా వైరస్ సోకినట్టు తేలిందని, ఆ రోగిని ఎర్నాకులంలోని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. 
 
దీనిపై మంత్రి శైలజ మాట్లాడుతూ, జ్వరం లక్షణాలతో ఇద్దరు ఆస్పత్రిలో చేరారు. వారిలో ఒకరికి నిఫా వైరస్ సోకినట్టు తేలింది. మరొకరు జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. అయితే, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు చేపట్టామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. ఇదిలావుండగా, కేరళ రాష్ట్ర వ్యాప్తంగా 86 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments