Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో భార్యల మార్పిడి సెక్స్ రాకెట్ - టెలిగ్రామ్ గ్రూపు ద్వారా అనుసంధానం

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (11:47 IST)
కేరళ రాష్ట్రంలో భారీ సెక్స్ రాకెట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అనేక మంది పురుషులు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి తమ భార్యలను పరాయి పురుషులకు పడక సుఖం కోసం పంపించే రాకెట్‌ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పరాయి పురుషుడుతో లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ ఓ మహిళపై కట్టుకున్న భర్త ఒత్తిడి చేశారు. 
 
ఈ వేధింపులను భరించలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ సెక్స్ రాకెట్ వ్యవహారాన్ని వెలుగు చూసింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు వెయ్యి మందికి వరకు పురుషులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో సంపన్న కుటుంబాలకు చెందిన వారు సైతం సభ్యులుగా ఉండటం విస్తుపోయేలా చేస్తుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తన భర్త మరో పురుషుడితో లైంగిక సంబంధానికి ఒత్తిడి చేస్తున్నాడంటూ ఓ బాధితురాలు కేరళ రాష్ట్రంలోని కురుకచల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారరణ చేపట్టారు. ప్రాథమికంగా జరిపిన విచారణలో కయంకులమ్‌లో ఈ తరహా కేసులు ఉన్నట్టు గుర్తించారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల సాయంతో ఒక గ్రూపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రపాలాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. 
 
టెలిగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి వీటి ద్వారా సభ్యుల మధ్య భాగస్వాముల మార్పిడి జరుగుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ సమూహంలో దాదాపు 1000 మంది వరకు సభ్యులు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే బాధితురాలి భర్తను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ రాకెట్ వెనుక పెద్ద ముఠానే ఉందని చంగన్ చెర్రీ డీఎస్పీ ఆర్. శ్రీకుమార్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం