Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ ఎమ్మెల్యే ఓవరాక్షన్.. భోజనం వడ్డించడం లేటైందని.. చెంప ఛెళ్లుమనిపించాడు..

కేరళలో ఓ ఎమ్మెల్యే ఓవరాక్షన్ చేశారు. భోజనం వడ్డించడం 20 నిమిషాలు లేటైందని.. క్యాంటీన్‌లో పనిచేస్తున్న ఓ సర్వర్ చెంప ఛెళ్లుమనిపించాడు.. ఆ ఎమ్మెల్యే. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (09:57 IST)
కేరళలో ఓ ఎమ్మెల్యే ఓవరాక్షన్ చేశారు. భోజనం వడ్డించడం 20 నిమిషాలు లేటైందని.. క్యాంటీన్‌లో పనిచేస్తున్న ఓ సర్వర్ చెంప ఛెళ్లుమనిపించాడు.. ఆ ఎమ్మెల్యే. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే కొట్టాయం జిల్లా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జార్జ్ (65) తన కార్యాలయంలో ఉన్నారు. తనకు భోజనం కావాలని మధ్యాహ్నం 1.40 గంటలకు ఆర్డర్ చేశారు. 2దాటినా భోజనం మాత్రం రాలేదు. అంతే క్యాంటీన్ సూపర్ వైజర్‌ను పిలిచి అడిగారు. కుర్రాడిని పంపించినట్లు సూపర్ వైజర్ సమాధానం ఇచ్చారు. 
 
చెప్పినట్లుగానే కుర్రాడు భోజనం తీసుకుని జార్జ్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో ఆ కుర్రాడిపై జార్జ్ తిట్ల పురాణం ఎత్తుకున్నారు. తిట్టాల్సిన అవసరం లేదని ఆ కుర్రాడు అనగా... చెంప ఛెళ్లుమనిపించారు. దీంతో ఆ కుర్రాడు ఫైర్ అయ్యాడు. ఎమ్మెల్యే అనవసరంగా తనను కొట్టారని మీడియా ముందు వాపోయాడు. కానీ ఈ ఘటనపై ఎవ్వరికీ ఫిర్యాదు చేయలేదు. దీనిపై స్పందించిన జార్జ్... తాను ఆ కుర్రాడిని తిట్టి పంపించానని.. కొట్టలేదన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments