Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భంతో వున్న మేకపై అత్యాచారం.. రక్తస్రావంతో మృతి.. వ్యక్తి అరెస్ట్

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (16:19 IST)
కేరళలో నీచమైన ఘటన చోటుచేసుకుంది. కామాంధులు మహిళలపై విరుచుకుపడటమే కాకుండా నోరు లేవి మూగజీవాలపై కూడా వదిలిపెట్టట్లేదు. తాజాగా అలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది.

కేరళలో ఓ హోటల్‌లో పనిచేసే ఉద్యోగి గర్భంతో వున్న మేకపై అకృత్యానికి పాల్పడ్డాడు. గర్భంతో వున్న మేకతో అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డాడనే ఆరోపణలతో తమిళనాడుకు చెందిన 37 ఏళ్ల హోటల్ ఉద్యోగిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలోని అరంతంగికి చెందిన సెంథిల్‌ను పోలీసులు అరెస్టు చేసి, ఐపిసి సెక్షన్ 377 కింద కేసు కోర్టులో హాజరు పరిచారు.

కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇకపోతే. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. కోటచేరిలోని ఒక హోటల్ పెరట్లో రెండు మేకలను కట్టారు. 
 
కానీ మేక అరుపులు విన్న హోటల్ ఉద్యోగులు అక్కడికి చేరుకుని నాలుగు నెలల గర్భిణి మేకకు రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. కొంత సేపటి తర్వాత మేక గాయాలతో మరణించింది. 
 
ఆపై మేకపై మద్యం మత్తులో ఉన్న సెంథిల్ అసహజ లైంగిక దాడికి పాల్పడినట్లు గుర్తించిన హోటల్ ఉద్యోగులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. సెంథిల్ మూడు నెలల క్రితమే కేరళ హోటల్‌లో ఉద్యోగం కోసం చేరాడని పోలీసుల విచారణలో తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం