Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏ ఒక్కరూ యూట్యూబ్ చానెల్ నిర్వహించరాదు.. కేరళ సర్కారు ఉత్తర్వులు

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (08:37 IST)
కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ కూడా యూట్యూబ్ చానెల్ నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీచేసింది. యూట్యూబ్ చానెల్ కలిగివున్న ఉద్యోగులు తక్షణం తమ చానెల్‌ను మూసివేయాలని ఆదేశించింది. 
 
స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం అతి సామాన్యులు సైతం వారి ప్రతిభకు అనుగుణంగా యూట్యూబ్‌ ఛానల్స్‌ విజయవంతంగా నడుపుతున్న విషయం తెలిసిందే. కొందరు ఉద్యోగులు సైతం ఇదే బాట పట్టి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకొంటున్నారు. 
 
వంటలు, కామెడీ కార్యక్రమాల వీడియోలు అప్‌లోడ్‌ చేసి రూ.లక్షల్లో సంపాదిస్తున్నవారూ ఉన్నారు. ఈ అదనపు ఆదాయ మార్గంపై వేటు వేస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఒక్కరూ ఇకపై యూట్యూబ్‌ ఛానల్స్‌ను నిర్వహించవద్దంటూ కేరళ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు అలా చేయడం.. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని జీవోలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments