Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందమైన వరుడుకి వధువు కావాలి : వైరల్‌గా మారిన కేరళ యువకుడి పెళ్లి ప్రకటన.. ఎందుకు?

సాధారణంగా పత్రికల్లో లేదా మాట్రిమొనియల్ వెబ్‌సైట్లలో పెళ్లి ప్రకటనలు ఇచ్చేటపుడు ప్రధానంగా మతం, కులం, విద్యార్హతలను స్పష్టంగా పేర్కొంటారు. ఈ ప్రకటనలు కులాలు, మతాలవారీగా కూడా కేటగిరీ చేస్తూ దినపత్రికలు

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (17:34 IST)
సాధారణంగా పత్రికల్లో లేదా మాట్రిమొనియల్ వెబ్‌సైట్లలో పెళ్లి ప్రకటనలు ఇచ్చేటపుడు ప్రధానంగా మతం, కులం, విద్యార్హతలను స్పష్టంగా పేర్కొంటారు. ఈ ప్రకటనలు కులాలు, మతాలవారీగా కూడా కేటగిరీ చేస్తూ దినపత్రికలు ప్రచురిస్తాయి. అయితే పెళ్లి చేసుకుందామనుకున్న ఓ 29 ఏళ్ల యువకుడి మతం మాత్రం ప్రకటనల్లో కనిపించలేదు. దీంతో ఈ ప్రకటన చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రస్మిన్ శివశంకర్ అనే 29 ఏళ్ల యువకుడి స్వస్థలం కేరళలోని పరవూర్. తాను నమ్మిన మతం పేరుతో వధువు కావాలని ఓ మలయాళం దినపత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. డిన్‌కోయిస్ట్, అందమైన 29 సంవత్సరాల ఎంటెక్ యువకుడికి వధువు కావాలనేదే ఆ ప్రకటన సారాంశం. 
 
ఇంత పెద్ద దేశంలో, ఇన్ని మ్యాట్రిమొనియల్ సైట్స్‌లో తను నమ్మిన మతం లేదా అంటూ శివశంకర్ ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు, తన మతానికి చెందిన అమ్మాయిని చూడమని కోరుతున్నాడు. నేషనాలిటీ ఏదైనా ఫర్లేదంటున్నాడు. పాకిస్థాన్ అమ్మాయి అయినా అభ్యంతరం లేదంటున్నాడు. ఈ వింత యాడ్ ఇప్పుడు నెట్‌లో వైరల్‌గా మారింది.
 
ఇంతకీ ఆ యువకుడి మతం ఏంటనే కదా మీ సందేహం. కొందరు హేతువాదులు ఉన్న మతాలను పాటించరు. కానీ లేని మతాన్ని సృష్టించుకుంటారు. అలా కేరళలో 2008 నుంచి హేతువాదులు తమకో మతాన్ని సృష్టించుకున్నారు. ఆ మతం పేరు డిన్‌కోయిజమ్. వాళ్లకు ఓ దేవుడు ఉన్నాడు. అదే సూపర్‌మ్యాన్ వేషంలో ఉన్న ఎలుక. బాలమంగళం అనే చిల్డ్రన్స్ మ్యాగజైన్‌లోని ఫిక్షనల్ క్యారెక్టర్‌లో ఉన్న ఎలుక మాదిరిగా ఇది కనిపిస్తుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments