Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ కామెంట్స్ ఎఫెక్ట్... భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలు బ్యాంకు వివరాలు చెప్పండి... మోదీ

సోమవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనువెంటనే ఆచరిస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... నల్లడబ్బు అంటూ సామాన్యులను మాత్రమే టార్గెట్ చేసి వదిలేస్తే ప

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (14:24 IST)
సోమవారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనువెంటనే ఆచరిస్తున్నారా అనిపిస్తోంది. ఎందుకంటే నిన్న రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ... నల్లడబ్బు అంటూ సామాన్యులను మాత్రమే టార్గెట్ చేసి వదిలేస్తే పారదర్శకత ఉన్నట్లు కాదనీ, అందువల్ల రాజకీయ నాయకులు సైతం వారివారి ఆస్తుల వివరాలన్నిటినీ ప్రజలకు తెలియజేయాలనీ, వారి వద్ద ఉన్న ధనం ఎంతో లెక్కచెప్పినప్పుడే ప్రజలు కూడా సమస్య పట్ల మరింత సానుకూలంగా ఉంటారని అన్నారు. ఈ మేరకు కేసీఆర్ మీడియాముఖంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పిలుపునిచ్చారు. 
 
ఈ నేపధ్యంలో మంగళవారం నాడు ప్రధానమంత్రి మోదీ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా తమతమ బ్యాంకు ఖాతా వివరాలన్నిటినీ నవంబరు 8 నుంచి డిసెంబరు 31 లోపు సమర్పించాలని కోరారు. ఆ వివరాలన్నీ భాజపా అధ్యక్షుడు అమిత్ షాకు అందజేయాలన్నారు. 
 
సామాన్య ప్రజలను వేధిస్తూ మీరు మాత్రం నల్లడబ్బును దాచుకుంటున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు నరేంద్ర మోదీ ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఏదైతేనేం ధనవంతులు తమ డబ్బును పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి జీవితాల్లో వెలుగు రేఖలు పూస్తాయనడంలో సందేహంలేదు. మరి ఈ కార్యక్రమం ఎంతమేరకు ముందుకు వెళుతుందో చూద్దాం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments