Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ కస్టడీలో కవిత.. ఏకాదశి వ్రతం.. భగవద్గీత చదువుతూ..?

సెల్వి
శుక్రవారం, 22 మార్చి 2024 (19:17 IST)
బీఆర్ఎస్ నేత, నిజామాబాద్ ఎమ్మెల్సీ కె. కవిత ఈడీ కస్టడీలో ఏకాదశి వ్రతం ఆచరించారు. ఏకాదశి సందర్భంగా భగవద్గీత చదివారు. ఆ శ్లోకాలను చదువుతూ కాలం గడిపారు. ఇంకా ఉపవాసం కూడా ఆచరించారని తెలుస్తోంది. 
 
కోట్లాది రూపాయల ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నందున కవితను కొన్ని రోజుల క్రితం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీ ఆమె అరెస్టును పెండింగ్‌లో పెట్టిందని, బీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఓడిపోవడంతో పాటు రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈడీ అధికారులు రాజకీయ మైలేజ్ కోసమే ఆమెను అదుపులోకి తీసుకున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ ఆరోపించారు. 
 
ఈ నేపథ్యంలో ఏకాదశి సందర్భంగా కవిత బుధవారం ఉపవాస దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆమె భగవద్గీత చదివి, కొన్ని శ్లోకాలు పఠిస్తూ, ధ్యానంలో కూడా కూర్చున్నట్లు సమాచారం. ఉపవాసంలో భాగంగా, పండ్లు మాత్రం తీసుకున్నారు. 
 
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర వంటి కొన్ని స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు, మరికొన్ని పుస్తకాలను తనకు తెప్పించాలని కవిత అధికారులను కోరినట్లు తెలిసింది. వారం రోజులుగా కవిత ఢిల్లీలోని ఈడీ కస్టడీలో ఉంటున్నారు. 
 
శనివారంతో ఆమె ఈడీ కస్టడీ ముగియనుంది. దీంతో మళ్లీ కస్టడీకి కోరతారా.. లేదా జ్యూడిషియల్ రిమాండ్‌కు కవితను తరలిస్తారా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ పరిస్థితులను న్యూస్ పేపర్స్ చదవి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments