Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణానిధి ఆరోగ్యంపై కావేరీ తీరు భేష్.. ఫోటోతో కూడిన ప్రకటన రిలీజ్.. అమ్మకే అది కరువైంది..

డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్యంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. వదంతులకు చెక్ పెట్టే దిశగా కావేరీ ఆస్పత్రి యాజమాన్యం భేష్‌ అనిపించుకుంది. ఈ క్రమంలో కరుణానిధి ఫోటోతో కూడిన హెల్త్ బులిటెన్‌ను వ

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2016 (14:12 IST)
డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి ఆరోగ్యంపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. వదంతులకు చెక్ పెట్టే దిశగా కావేరీ ఆస్పత్రి యాజమాన్యం భేష్‌ అనిపించుకుంది. ఈ క్రమంలో కరుణానిధి ఫోటోతో కూడిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. కరుణానిధి ఆరోగ్యం ఎలా ఉందోనని పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో కరుణ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని.. ఆయన మెల్ల మెల్లగా కోలుకుంటున్నారని.. ఆంటీ బయోటిక్స్ ఇస్తున్నామని.. పూర్తిగా కోలుకున్నాక కరుణను డిశ్చార్చ్ చేస్తామని కావేరి యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా కరుణానిధి కూర్చుని టీవీ చూస్తున్నట్లు గల ఫోటోను కూడా కావేరీ ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసింది. 
 
కానీ ఈ ఫోటోను చూసినవారంతా దివంగత సీఎం జయలలిత పట్ల అపోలో ఇలా వ్యవహరించి వుంటే ఎంత బాగుండేదని వాపోతున్నారు. 75 రోజుల పాటు అమ్మ ఆస్పత్రిలో ఏం చేశారు? ఆమె ఫోటోలు, ఆమెకు అందించిన వైద్య చికిత్సల పట్ల వట్టి బులిటెన్లు మాత్రమే విడుదల చేసిన అపోలో యాజమాన్యం.. ఫోటోలను ఏమాత్రం లీక్ చేయలేదు.

దీనిని బట్టి అమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందారా ? లేకుంటే..? బ్రెయిన్ డెడ్ అయినా కూడా చికిత్స అందిస్తున్నట్లు నటించారా అనే దానిపై మిస్టరీ వీడలేదు. కరుణ లాగానే.. అపోలో కూడా అమ్మ చికిత్స పొందే ఫోటోలను విడుదల చేసి వుంటే అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ప్రజలకు కాస్త ఊరట నిచ్చివుండే అవకాశం ఉండేదని.. కానీ అపోలో యాజమాన్యం ఆ పని చేయలేదని ప్రజలు వాపోతున్నారు. మొత్తానికి జయలలిత మరణంపై నెలకొన్న మిస్టరీ ఏమాత్రం వీడేట్లు లేదని ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగచైతన్య కోసం శోభిత అదంతా చేస్తుందా?

కొత్తవారితో ద్విభాషా చిత్రంగా మహా సంద్రం పూజతో ప్రారంభం

స్లమ్ లో ధనుష్, బిజినెస్ మేన్ నాగార్జున, మద్యతరగతి అమ్మాయి రష్మిక కథే కుబేర

కళ్యాణ్ బాబు ధైర్యం అంటే ఇష్టం - నాకు పోటీ ఎవరూ లేరు నేనే : అల్లు అర్జున్

అల్లు అర్జున్ కోసం పనిచేశా, ఓజీ కోసం కొరియన్ టీమ్ తో పనిచేస్తున్నా: థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments