Webdunia - Bharat's app for daily news and videos

Install App

కథక్ నృత్యకారిణి సితార దేవి ఇక లేరు.. నరేంద్ర మోడీ సంతాపం!

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (12:35 IST)
ప్రముఖ కథక్ నృత్యకారిణి సితార దేవి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయస్సు 94 యేళ్లు. అనారోగ్య కారణంగా సితార దేవిని జస్లోక్ ఆస్పత్రిలో కొద్ది రోజుల క్రితం చేర్చారు. ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఆమెను సోమవారం ఉదయం నుంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అంతకుముందు సితార దేవిని కుంబల్ల హిల్ ఆస్పత్రి, హర్ట్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను జస్లోక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారని ఆమె అల్లుడు రాజేశ్ మిశ్రా తెలిపారు. 
 
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 1920లో జన్మించిన సితారా దేవి... తండ్రి వద్ద కవితలు, కొరియోగ్రఫీ నేర్చుకున్నారు. చిన్ననాటి నుంచి ఆమెకు నృత్యం ఆసక్తి ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. ఆమె తండ్రి వైష్ణవిట్ బ్రాహ్మిణ్ స్కాలర్, కథక్ కళాకారులు కావడంతో ఆమెను మరింత ప్రోత్సహించారు. నృత్య పాఠశాలలో గురువుల వద్ద ఆమె ఎంతో ఆసక్తిగా విద్యను నేర్చుకున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ స్ఫూర్తితో సితార దేవి సాహిత్యంపై పట్టు సాధించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments