Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీసా ముగిసినా కర్నాటకలో తిష్టవేసిన ఆఫ్రికా యూత్... దేశంలో వివిధ ప్రాంతాలకు... ఏం చేస్తున్నారో...?!!

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (14:57 IST)
మనం ఏ దేశంలోనైనా అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి. దానిక్కూడా నిర్ణీత కాలవ్యవధి ఉంటుంది. ఆ లోపే మనం తిరిగి మన స్వదేశానికి వచ్చేయాలి. కానీ ఆఫ్రికా దేశం నుంచి కర్నాటక రాష్ట్రానికి వచ్చిన 500 మంది యువతీయువకులు తమ వీసా గడువు ముగిసినప్పటికీ ఇక్కడే తిష్టవేసి ఉంటున్నారట. బెంగళూరులో ఇటీవల ఓ మహిళపై జరిగిన ఘటనలో ఆఫ్రికన్ యూత్ కూడా ఉన్నారన్న ఆరోపణల నేపధ్యంలో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తే ఈ నిజాలు వెలికివచ్చాయి. 
 
దీనిపై కర్నాటక హోంమంత్రి పరమేశ్వర మాట్లాడుతూ... కర్నాటకలో నివాసముంటున్న విదేశీయుల్లో చాలామందికి వీసా గడువు తీరిపోయినా ఇక్కడే ఉంటున్నట్లు తేలింది. వారందరినీ త్వరలో వారివారి దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం లెక్కలను పోలీసులు పరిశీలించినప్పుడు ఈ విషయం బయటపడిందంటూ చెప్పారాయన. 
 
కాగా గత ఏడాది ఆఫ్రికా దేశం నుంచి కర్నాటక వచ్చిన 500 మంది యువతీయువకులు తమతమ వీసాల గడువు ముగిసినప్పటికీ ఇక్కడ నుంచి వెళ్లలేదని తేలింది. పైగా వారంతా ఇపుడు కర్నాటక రాష్ట్రంలో లేరట. దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇలా వెళ్లిపోయిన వారు ఏమేమి చేస్తున్నారన్నది ఇపుడు సస్పెన్సుగా మారింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments