Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారస్వామికి బీఎస్పీ ఎమ్మెల్యే షాక్... ఓటింగ్‌కు దూరంగా...

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (17:53 IST)
కర్నాటక రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యమంత్రి కుమార స్వామి ప్రభుత్వం ఎదుర్కొంటున్న విశ్వాస పరీక్ష రోజుకో విధంగా కీలక మలుపులు తిరుగుతోంది. కుమారస్వామి ప్రభుత్వానికి బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ పార్టీ అధినేత్రి మాయావతి ఆదేశం మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్ విశ్వాస పరీక్షకు దూరంగా ఉండనున్నారు. 
 
కర్నాటకలో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెల్సిందే. అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌కు బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. హెచ్ డీ కుమారస్వామి సర్కార్‌కు మద్దతు ప్రకటించిన బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ యూటర్న్‌ తీసుకున్నారు. 
 
సోమవారం జరుగనున్న విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉండాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి తనను కోరారని ఎమ్మెల్యే ఎన్ మహేశ్ అన్నారు. తాను పార్టీ (బీఎస్పీ) అధిష్టానం ఆదేశాల మేరకు సోమ, మంగళవారాల్లో సభకు హాజరు కాబోనని స్పష్టంచేశారు. తన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే మహేశ్ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments