Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ రాత్రి శ్మశానంలో బస చేయనున్న కర్ణాటక మంత్రి!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (19:00 IST)
కర్ణాటక మంత్రి ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల్లో మూఢ నమ్మకాలపై చైతన్యం కలిగించేందుకు ఆయన ఒక రోజు రాత్రి శ్మశానంలో నిద్రించాలని నిర్ణయించారు. ఆ మంత్రి పేరు సతీష్ జర్కిహోళి. ఎక్సైజ్ శాఖా మంత్రివర్యులు. 
 
గతంలో కర్ణాటకలో జేడీ (ఎస్) అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి హెచ్‌డి. కుమారస్వామి 'గ్రామాల్లో బస' కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఆ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అప్పట్లో ఇది బాగా ఆదరణ పొందింది. ఇప్పుడు ఆ కార్యక్రమానికి కాస్త అటూఇటూగా మార్చారు. 
 
ప్రజల్లో మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన శ్మశానంలో ఓ రాత్రి గడపాలని నిశ్చయించుకున్నారు. బెళగావి నగరంలో డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని, వైకుంఠధామ్ శ్మశాన వాటికలో నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
దీనిపై మంత్రి మాట్లాడుతూ, తనకు ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉందని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన ప్రచారం బెళగావి నుంచి మొదలవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాజకీయనేతలను ఎవరినీ పిలవడంలేదని తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు శ్మశానమే అత్యుత్తమ ప్రదేశమని అభిప్రాయపడ్డారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments