Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడకగదిలో రహస్యంగా డీవీఆర్.. ఫ్రెండ్‌తో శృంగారం.. భర్తకు విడాకులు

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (12:46 IST)
పడకగదిలో రహస్యంగా డీవీఆర్ వుంచిన భర్త విడాకులు తీసుకోవడంలో గెలిచాడు. అతను ఊళ్లో లేనప్పుడు ఆమె ఫ్రెండ్స్‌లో ఒకడు ఆ ఇంటికి వచ్చాడు. ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఇదంతా డీవీఆర్‌లోని డీవీడీలో రికార్డైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ భర్త బళ్లారి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఇలా బెడ్‌రూంలో వీడియో రికార్డర్ పెట్టడాన్ని తప్పుపట్టిన కోర్టు, సాక్ష్యాధారాలు వీడియో బలంగా ఉండటంతో విడాకులకు ఓకే చెప్పింది.
 
వివరాల్లోకి వెళితే.. బళ్లారికి చెందిన అతనికి 1997 జులై 7న ఆమెతో పెళ్లైంది. వాళ్లకు ఇద్దరు కూతుర్లున్నారు. 2008 జూన్ 4 నుంచీ జూన్ 9 వరకు బెంగళూరు వెళ్లాల్సి రావడంతో తన భార్యపై అనుమానం ఉన్న అతను బెడ్‌రూంలో సీక్రెట్‌గా డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్)ను ఉంచాడు. దీంట్లో ఈ తతంగమంతా రికార్డు అయ్యింది.
 
కానీ కింది కోర్టు తీర్పును ఆమె 2013 జులై 30న పైకోర్టులో (హైకోర్టులో) సవాల్ చేశారు. తన భర్తకు పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ తీసే అలవాటు ఉందన్న ఆమె... తనను బలవంతంగా అలాంటి వాటిలో నటించేలా చేయిస్తున్నారని ఆరోపించారు. ఆ వీడియోలో ఉన్నది కూడా అలాంటిదే అన్నారు. తన భర్త బెంగళూరు వెళ్లలేదనీ... ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. అందువల్ల విడాకులు ఇవ్వాలన్న కింది కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరారు.
 
అయితే వీడియో చూసిన ఇద్దరు జడ్జిల ద్విసభ్య ధర్మాసనం... ఆమె చెప్పిన మాటలు నమ్మేలా లేవని తెలిపింది. ఆ వీడియోలో ఎక్కడా ఆమె బలవంతంగా సెక్స్‌లో పాల్గొన్నట్లు లేదని తేల్చింది. పైగా ఆమె భర్త పోర్నోగ్రఫీ ఫిల్మ్స్ చేయిస్తున్నట్లు ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం