Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టులోనే జడ్జి కడుపులోకి కత్తి దిగింది.. ఎక్కడ?

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయమూర్తి గదిలో జడ్జి కడుపులోకి కత్తి దిగింది. న్యాయవాదినని చెప్పి జస్టిస్ గదిలోకి ప్రవేశించిన తేజాస్ శర్మ అనే వ్యక్తి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితం

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (17:27 IST)
కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. న్యాయమూర్తి గదిలో జడ్జి కడుపులోకి కత్తి దిగింది. న్యాయవాదినని చెప్పి జస్టిస్ గదిలోకి ప్రవేశించిన తేజాస్ శర్మ అనే వ్యక్తి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా లోకాయుక్త జడ్జి విశ్వానథ్ శెట్టి (74)ను పోడిచాడు. ఈ ఘటనతో షాక్ అయిన భద్రతా సిబ్బంది వెంటనే.. ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన శర్మను అరెస్ట్ చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే జస్టిస్ విశ్వనాథ్ శెట్టి (74) రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి. గత ఏడాది జనవరిలో ఆ రాష్ట్ర లోకాయుక్త జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 7వ తేదీ బుధవారం మధ్యాహ్నం శర్మ అనే వ్యక్తి ఆఫీస్‌కు వచ్చాడు. తనకు తాను లాయర్ అని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు. కేసుల విషయమై జడ్జితో మాట్లాడాలని చెప్పాడు. అతని వేషధారణ చూస్తే అలాగే ఉండటంతో గది లోపలికి అనుమతించారు. 
 
అలా వెళ్లిన ఒకటి, రెండు నిమిషాల్లోనే జస్టిస్ శెట్టిపై కత్తితో దాడి చేసి కడుపుతో పోట్లు పొడిచాడు. ప్రస్తుతం ఆయన మాల్యా ఆస్పత్రిలోని ఐసీయులో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే సీఎం సిద్ధరామయ్య ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. అందుకోసం ఐజీ స్థాయి అధికారిని నియమించారు. జడ్జికి ఎలాంటి ప్రాణాపాయం లేదని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments