Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో పెళ్లి చేసుకోవడం నిషేధం.. ఉద్యోగం ఇవ్వలేం: కర్ణాటక హైకోర్టు

కర్ణాటక హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. 1971 ఆర్టీసీ నిబంధనల ప్రకారం రెండో వివాహం చేసుకోవడం నిషేధమని.. అందుచేత రెండో భార్య కుమారుడికి కారుణ్య నియామకం ఇవ్వవలేమని కేఎస్ఆర్టీసీ తెలిపింది. వివరాల్

Webdunia
మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (09:30 IST)
కర్ణాటక హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. 1971 ఆర్టీసీ నిబంధనల ప్రకారం రెండో వివాహం చేసుకోవడం నిషేధమని.. అందుచేత రెండో భార్య కుమారుడికి కారుణ్య నియామకం ఇవ్వవలేమని కేఎస్ఆర్టీసీ తెలిపింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరానికి చెందిన కె.భీమగౌడ కర్ణాటక రాష్ట్ర రోడ్డురవాణసంస్థలో డ్రైవరుగా 16 ఏళ్లపాటు పనిచేసి 2009 ఫిబ్రవరి 22వతేదీన మృతి చెందాడు. 
 
భీమగౌడ రెండో భార్య అయిన శాంతమ్మ తన కుమారుడైన ప్రదీప్ కుమార్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని కోరారు. కాగా అప్పటికే మొదటి భార్య కుమారుడైన కుమారస్వామికి బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇవ్వడంతో రెండో భార్య కుమారునికి ఉద్యోగం ఇవ్వలేమని కేఎస్ఆర్టీసీ తెలిపింది.
 
దీనిపై 1971 ఆర్టీసీ నిబంధనల ప్రకారం రెండో పెళ్లి చేసుకోవడం నిషేధమని అందువల్ల రెండో భార్య కుమారుడికి కారుణ్య నియామకం ఇవ్వలేమని కేఎస్ఆర్టీసీ తెలిపింది. దీంతో రెండో భార్య పెట్టిన వినతిని తోసిపుచ్చుతూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments