Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ కోర్టులో కర్ణాటక బంతి.. ఛాన్సివ్వకుంటే న్యాయపోరాటం

కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు బంతి ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా కోర్టులో ఉంది. ఆయన కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుంటే న్యాయపోరాటం చేయాలని కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వ

Webdunia
బుధవారం, 16 మే 2018 (12:14 IST)
కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు బంతి ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా కోర్టులో ఉంది. ఆయన కాంగ్రెస్ - జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వకుంటే న్యాయపోరాటం చేయాలని కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు.. బీజేపీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. దీంతో కొత్త  ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా జేడీఎస్‌లో చీలిక లేదని ఆ పార్టీ నేత కుమారస్వామి గౌడ చెబుతున్నారు. 
 
కాగా, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కేవలం స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగడితే సరిపోదు. అందుకే, జేడీఎస్‌లో చీలిక తెచ్చేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నట్టు సమాచారం. దీంతో, తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్ జాగ్రత్తపడుతున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. వీరికి ఇప్పటికే కేరళ పర్యాటక శాఖ కూడా ఆహ్వానం పలికుతూ ట్వీట్ కూడా చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments