Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ బాలికపై తండ్రి అత్యాచారపర్వం.. పూజ పేరుతో మంత్రగాడు కూడా...

కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకూతురుపై ఓ కిరాతక తండ్రి కన్నేశాడు. బాలికను బెదిరించి తన పశువాంఛను తీర్చుకుంటూ వచ్చాడు. అంతేనా ఓ మంత్రిగాడి వద్దకు తీసుకెళ్లగా అత

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (11:51 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకూతురుపై ఓ కిరాతక తండ్రి కన్నేశాడు. బాలికను బెదిరించి తన పశువాంఛను తీర్చుకుంటూ వచ్చాడు. అంతేనా ఓ మంత్రిగాడి వద్దకు తీసుకెళ్లగా అతను పూజ పేరుతో తన కోర్కెను తీర్చుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బెంగళూరు మాగడి అజ్జనహళ్లికి చెందిన రమేశ్ దంపతులు 14 ఏళ్ల కూతురుతో కలిసి కూలిపనుల కోసం రాజగోపాలనగరకు వలస వచ్చారు. కూలిపని లేనిరోజుల్లో ఇంట్లోనే ఉండే రమేశ్‌కు మైనర్‌ కూతురుపై వ్యామోహం పెరిగింది. తల్లితో చెబితే చంపేస్తానంటూ పాపను బెదిరించి తన కామ కోర్కెలు తీర్చుకుంటూ వచ్చాడు. 
 
తన తండ్రి చేస్తున్న పనులను బయటపెడితే తల్లిని చంపేస్తాడన్న భయంతో బాలిక ఈ ఘోరాన్ని మౌనంగానే భరిస్తూ వచ్చింది. ఇలా తండ్రి ప్రవర్తన హద్దులుదాటడంతో తీవ్ర ఆవేదనకు గురైన బాలిక తండ్రి నీచాన్ని తల్లితో మొరపెట్టుకుంది. అయితే ఆ తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా లగ్గెరెలోని చౌడేశ్వరినగరలో ఉన్న సోదరి ఇంటికి తీసుకెళ్లి స్థానికంగా ఉండే మంత్రగాడు మల్లేశ్‌ వద్దకు బాలికను పిలుచుకెళ్లారు. 
 
అతడు బాలికపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది పరీక్షించడానికంటూ ఒక తతంగం రూపొందించాడు. ఈ తతంగం పేరుతో దొంగస్వామి కూడా తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ విషయం ఇరుగుపొరుగు వారి నుంచి తెలుసుకున్న స్థానికులు కామాంధుడు రమేశ్, అతడి భార్యను, మల్లేశ్‌‌ను పట్టుకొని బుధవారం రాజగోపాలనగర పోలీసులకు సమాచారం అందించారు. తక్షణం ఘటనాస్థలానికి చేరుకున్న రాజగోపాలనగర పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి విచారణ చేపడుతున్నారు. బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments