Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమారస్వామి కుమారుడు వివాహం సింపుల్‌గా జరిగింది : సీఎం యడ్యూరప్ప

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (16:04 IST)
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న వేళ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంట ఓ శుభకార్యం జరిగింది. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడకు వివాహం జరిపించారు. వధువు కాంగ్రెస్ మాజీ నాయకుడు కృష్ణప్ప మనవరాలు రేవతి. 
 
నిఖిల్ గౌడ - రేవతిల వివాహం రామనగర జిల్లాల్లో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులతో పాటు.. కేవలం 60 మంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. 
 
అయితే, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమలు అవుతున్న కారణంగా పెళ్లి వేదికను బెంగళూరు నుంచి రాంనగరలోని ఫామ్ హౌస్‌కు మార్చి, అనుమతులు తీసుకుని ఈ పెళ్లి జరిపించారు. అయినప్పటికీ విమర్శలు వచ్చాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందిపోయి ఇలా వ్యవహరించడమేంటని చాలా మంది ప్రశ్నించారు.
 
పైగా, ఈ వివాహానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప కూడా హాజరయ్యారు. అయితే, ఈ వివాహం వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించారు. ఆ పెళ్లిపై సానుకూలంగా వ్యాఖ్యానించారు. ఆ పెళ్లి గురించి చర్చించాల్సిన అవసరమేమీ లేదని, ఇందుకోసం అవసరమైన అనుమతులన్నీ ఇచ్చామని తెలిపారు. ఆ వివాహం కూడా చాలా సింపుల్‌గానే జరిగిందని వివరణ ఇచ్చారు. 
 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారి పరిమితుల్లో బాగానే చేశారని అన్నారు. అందుకు తాను వారిని అభినందిస్తున్నాని కూడా యడియూరప్ప అనడం గమనార్హం. కాగా, ఈ వివాహంపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ రాంనగర్‌ డిప్యూటీ కమిషనర్‌కు యడియూరప్ప ఆదేశాలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments