Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ గ్రూపులో పోర్న్ చిత్రాలు.. బీజేపీ ఎమ్మెల్సీ నిర్వాకం... అవాక్కైన మహిళా ఎమ్మెల్సీలు...

కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్సీ సిగ్గుమాలిన పనికి పాల్పడ్డాడు. తన మొబైల్ ఫోన్ నుంచి వాట్సాప్‌ గ్రూపుకు 50 పోర్న్ చిత్రాలను పోస్ట్ చేశాడు. ఈ చిత్రాలను చూసిన వెంటనే సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మ

Webdunia
బుధవారం, 3 మే 2017 (09:51 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్సీ సిగ్గుమాలిన పనికి పాల్పడ్డాడు. తన మొబైల్ ఫోన్ నుంచి వాట్సాప్‌ గ్రూపుకు 50 పోర్న్ చిత్రాలను పోస్ట్ చేశాడు. ఈ చిత్రాలను చూసిన వెంటనే సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు మీడియా జర్నలిస్టులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్నాటక రాష్ట్రంలోని బెల్గావి పట్టణానికి చెందిన మహన్ తేష్ కవతగిమాత్ అనే వ్యక్తి బీజేపీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయన బెల్గావి మీడియా ఫోర్స్ వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుడుగా ఉన్నాడు. ఈ క్రమంలో తన మొబైల్  ఫోన్ నుంచి ఆయన 50 అశ్లీల చిత్రాలను వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. ఈ పని తెలిసి చేశాడో.. తెలియక చేశాడో తెలియదు కానీ... ఈయనగారి నిర్వాకం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
 
పైగా, ఈ గ్రూప్‌లో సీనియర్ రాజకీయనాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐపీఎస్, ఐఏఎస్‌ కేడర్‌కు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు, జర్నలిస్టులు ఉన్నారు. మహన్ తేష్.. అశ్లీల చిత్రాలతోపాటు రాజకీయ నాయకుల నిజాయితీపై పదునైన వ్యాఖ్యలతో వాట్సాప్‌లో ఓ సందేశం పెట్టిన వెంటనే అది వైరల్‌గా మారింది. పైగా, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఎమ్మెల్సీ చేసిన పనిపై ఓ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రసారం చేశాయి. 
 
తాను చేసిన తప్పుడు పనికి సమాధానం ఇచ్చుకోలేని ఎమ్మెల్సీ.. తన మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మీడియా ఛానళ్లలో కూడా ఈ విషయం సంచలనంగా మారింది. కాగా, ఎమ్మెల్సీ అశ్లీల చిత్రాల పోస్టింగ్ వ్యవహారం కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

తర్వాతి కథనం