Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనకోడలిపై అత్యాచారం చేయించిన మేనత్త!!

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:37 IST)
కర్నాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరులో ఓ మేనత్త సభ్యసమాజం సిగ్గుపడేలా నడుచుకుంది. తల్లిలేని మేనకోడలిపై తన ఇంటి కోడులుగా చేసుకుంది. ఆ తర్వాత ఆ కోడలిపై 17 మందితో అత్యాచారం చేయించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే, 
 
చిక్‌మగళూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన విద్య అనే మహిళ ఉంది. ఈమె సోదరుడు భార్య చనిపోయింది. ఈయనకు ఓ కుమార్తె ఉంది. తల్లి చనిపోవడంతో ఆ 15 యేళ్ల బాలికను తాను పెంచుకుంటానని నమ్మించి ఇంటికి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొద్ది రోజులు బాగానే చూసుకున్న విద్య.. బాలికను స్థానికంగా ఓ స్టోన్ క్రషర్ కంపెనీలో పనికి పెట్టింది. 
 
అక్కడే పని చేస్తున్న ఓ బస్ డ్రైవర్ బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను తన ఫోన్‌లో వీడియో తీసుకుని పలుమార్లు లైంగిక దాడి చేశాడు. అది చాలదన్నట్లు ఆ వీడియోని బయట పెడతానని బాలికను బెదిరిస్తూ మరో 16 మందితో అత్యాచారం చేయించాడు. బాలికకు గర్భం రాకుండా మాత్రలు మింగించాడు. 
 
అయితే ఈ దారుణ ఘటన చైల్డ్ వెల్‌పేర్ కమిటీ చైర్‌పర్సన్ సుబ్రమణ్యకు తెలియడంతో ఆమె జనవరి 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను పనిలో పెట్టడం.. అక్కడ 17 మంది అత్యాచారం చేయడం అంతా ఆమె అత్త విద్య ప్లాన్ ప్రకారమే జరిగిందని తేలింది. 
 
డబ్బులకు కక్కుర్తి పడ్డ ఆమె.. కోడలిని ఆమెకు తెలియకుండనే వ్యభిచార కూపంలోకి నెట్టిందని పోలీసుల విచారణ బయటపడింది. అత్యాచారం చేసిన ప్రతి వ్యక్తి దగ్గర ఆమె డబ్బులు తీసుకోనే వారిని బాలిక దగ్గరకు పంపేదని తేలింది. ఇలా ఐదు నెలల పాటు బాలికకు కామాంధులు నరకం చూపించారని చిక్‌మగళూరు జిల్లా ఎస్పీ హకే అక్షయ్ మచింద్ర తెలిపారు. 
 
బాలికకు నిర్వహించిన వైద్య పరీక్షల్లోనూ ఆమెపై 17 మంది అత్యాచారం చేసినట్లు వెల్లడైందని వివరించారు. ఈ దారుణానికి పాల్పడిన బాలిక అత్త విద్యతోపాటు 8 మందిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం