టీ కోసం భార్యాభర్తల గొడవ.. భార్య నదిలో దూకేసింది.. మొసలి కనిపించింది.. చివరికి?

సెల్వి
బుధవారం, 10 సెప్టెంబరు 2025 (10:01 IST)
Crocodile
టీ కోసం భార్యాభర్తలు గొడవపడ్డారు. ఈ వివాదం కాస్త చిలికి చిలికి పెద్దదిగా మారింది. దీంతో భార్య కోపంతో సమీపంలో ఉన్న నదిలోకి దూకింది. అయితే క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయం ఆమెకు దూకిన తర్వాత తప్పు అనిపించి ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చింది. ఆ సమయంలో ఒడ్డుమీదున్న భారీ మొసలిని చూసి ఒక్కసారిగా ఖంగుతింది. ఆపై భయంతో వణికిపోయిన ఆ మహిళ.. చివరికి ఒక పని చేసి ప్రాణాలు కాపాడుకుంది. ఈ ఘటన కాన్పూర్‌లోని అహిర్వాన్‌లో చోటుచేసుకుంది. 
 
సురేష్ అనే వ్యక్తి తన భార్య మాల్టితో తరచూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతుండేవాడు. ఇందులో భాగంగానే శనివారం రాత్రి కూడా అలానే తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. తన భార్యను టీ తయారు చేయమని అడగగా.. తాను బాగా అలసిపోయానని.. ఇప్పుడు పెట్టలేనని చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య వాదన మొదలైంది. 
 
దీంతో కోపంతో నదిలో దూకేసింది.  దీంతో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని.. ఒడ్డు వైపుకు ఈదుకుంటూ వచ్చింది. ఆమె ఒడ్డుకు చేరుకోగానే అకస్మాత్తుగా నీటిలో ఒక పెద్ద మొసలి కనిపించింది. అప్పుడే తనకు సమీపంలో ఒక చెట్టు కనిపించింది. ఎలాగైన తన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో.. ఆమె త్వరగా దానిపై ఎక్కి రాత్రంతా అక్కడే కూర్చుంది. మరుసటి రోజు ఇంటికి చేరుకుంది. స్థానికులు, పోలీసుల సాయంతో ఆమెను చెట్టుపై నుంచి కిందకు దించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

తర్వాతి కథనం
Show comments